RS Praveen Kumar: మందు పార్టీ చేసుకోవాలనుకుంటున్నారా? సెటైర్ కాదు... సీరియస్ సూచన: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్

RS Praveen Kumar interesting suggestion for party

  • మోకిల ఘటన నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్
  • దావత్ ప్లాన్ చేసుకుంటే బ్రీత్ అనలైజర్లు, డ్రగ్ టూల్ కిట్లు దగ్గర ఉంచుకోవాలని వెల్లడి
  • మ్యారేజ్ సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకోవాలని సూచన
  • మందు తాగమని చెప్పను.. తాగితే మాత్రం బిల్లులు తీసుకోవాలని సలహా
  • మందు తాగుతున్నట్లు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎద్దేవా
  • గుడ్ అడ్వైజ్ అన్నా అంటూ స్పందించిన కేటీఆర్

దీపావళి పండుగ సందర్భంగా బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి దావత్ చేసుకోవాలనుకుంటే... మందు తాగాలనుకుంటే ఈ జాగ్రత్తలు పాటించాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని సూచనలు చేశారు. ఇటీవల మోకిలలో జరిగిన (జన్వాడ ఫాంహౌస్ కేసు నేపథ్యంలో) జరిగిన ఘటన నేపథ్యంలో కొన్ని సూచనలు చేశారు. చివరలో ఇది సెటైర్ కాదని... తన నుంచి సీరియస్ సూచన అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఈ సూచనలు చేశారు.

అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఈ ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేసి 'గుడ్ అడ్వైజ్ అన్నా' అని రాసుకొచ్చారు.

"తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీరందరు మీ కుటుంబాలతో హాయిగా గడపాలని కోరుకుంటున్నాను. అయితే... గతవారంలో మోకిలలో ఊహించని వేగంతో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా, పండుగల సందర్భంగా ప్రజలు కింది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోమని చెప్పడం నా బాధ్యత గా భావిస్తున్నాను" అని ప్రవీణ్ కుమార్ రాసుకొచ్చారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన సూచనలివే!

1. మీ బంధుమిత్రులతో  విందు భోజనం(దావత్) చేసే ప్లాను ఉంటే ఇంటి ముందు బ్రీత్ అనలైజర్లను, డ్రగ్ టూల్ కిట్లను దగ్గర ఉంచుకుంటే మంచిది. నీళ్లు బాగా తాగండి. యూరిన్ శాంపిల్స్ అవసరం పడవచ్చు. 

2. మీ మ్యారేజ్ సర్టిఫికెట్, వచ్చే దోస్తుల కుటుంబాల మ్యారేజ్ సర్టిఫికెట్, పిల్లల బర్త్ సర్టిఫికేట్లు పదిలంగా ఉన్నయో లేదో చూసుకోమని చెప్పండి. లేకపోతే కుటుంబాలను పురుషులు-మహిళలు అనే ప్రమాదముంది.

3. తాగమని సలహా ఇవ్వను... కాని తాగాలనుకుంటే తప్పకుండా మీ మందు సీసాలకు బిల్లులు ఉండేట్టుగా చూసుకోండి. ఎక్సైజ్ చట్టం ప్రకారం ప్రతి వ్యక్తి దగ్గర డ్యూటీ ఫ్రీ మద్యం రెండు లీటర్లు ఉండవచ్చు. IMFL అయితే 4.5 లీటర్లు ఉండవచ్చు. నో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లీజ్ అని కూడా సూచించారు.

4. ప్రతి మందు పార్టీ‌కి పర్మిషన్ ఉండాలని  మంత్రులు అంటున్నారు! కావున స్థానిక పోలీస్ స్టేషన్/ఎక్సైజ్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వండి.

5. మీరంటే గిట్టని వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చి కుటుంబ సభ్యులు సరదాగా గడుపుతుంటే దాన్ని ‘రేవ్’ పార్టీ అనే ప్రమాదం ఉంది. పోలీసులు ఎక్సైజ్ అధికారులు, స్నిఫర్ డాగ్, ఎస్‌వోటీలు ‘ఒక గంటలోనే’ మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. 

6. ఇంట్లో, ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు పని చేస్తున్నాయో లేదో సరిచూసుకోండి. మీ టవర్ లొకేషన్స్ మీరే తెలుసుకోండి. లేదంటే మన హోంశాఖ సహాయమంత్రి గారు ఊరుకోరు.

7. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని ‘బిగ్’యూట్యూబ్, మీడియా ఛానల్స్ పండుగ భోజనాన్ని రేవ్ పార్టీ అని, మీ కుటుంబ సభ్యుల ఫోటోలతో తప్పుడు శీర్షికలతో వైరల్ చేసే ప్రమాదం ఉంది. వాళ్ల మీద పరువునష్టం దావాకు పైసలు రెడీగా పెట్టుకోండి. వాళ్ల మీద యూట్యూబ్‌కు రిపోర్ట్ కొట్టడం నేర్చుకోండి.

8. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ స్థానిక అధికార పార్టీ నాయకులను అడగండి. వాళ్ల దగ్గర చాలా విలువైన సమాచారం ఉంటుంది.

9. టపాకాయలు కాల్చేటప్పుడు చిన్న పిల్లల మీద దృష్టి పెట్టండి. వాళ్లకే చాలా గాయాలు అవుతుంటాయని కూడా క్రాకర్స్ విషయంలో జాగ్రత్తలు చెప్పారు.

  • Loading...

More Telugu News