Chandrababu: దేశాన్ని సంఘటితపర్చడం కోసం వల్లభాయ్ పటేల్ ఎనలేని కృషి చేశారు: సీఎం చంద్రబాబు

AP CM Chandrababu paid tributes to Sardar Vallabhai Patel
  • నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
  • భారతదేశ ఉక్కు మనిషి అంటూ కీర్తించిన చంద్రబాబు
  • పటేల్ నిబద్ధత దేశ ఐక్యతకు బాటలు పరిచిందని కితాబు 
దేశం గర్వించదగ్గ నేతల్లో ఒకరైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (అక్టోబరు 31) సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించినట్టు ట్వీట్ చేశారు. 

భారతదేశ ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ పటేల్ దేశాన్ని సంఘటితపర్చడం కోసం ఎనలేని కృషి చేశారని కొనయాడారు. దేశ సమగ్రత కోసం ఆయన చూపిన నిబద్ధత భారతదేశ ఐక్యతకు బాటలు పరిచిందని చంద్రబాబు అభివర్ణించారు. సర్దార్ పటేల్ రగిల్చిన సంఘీభావం, స్వావలంబన అనే భావాలు నేటికీ మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని పేర్కొన్నారు.

Chandrababu
Sardar Vallabhai Patel
Birth Anniversary

More Telugu News