Ntr: ఓటీటీకి వచ్చేస్తున్న రెండు భారీ సినిమాలు!

OTT Movies Update

  • భారీ వసూళ్లను రాబట్టిన 'దేవర'
  • ద్విపాత్రాభినయంతో మెప్పించిన ఎన్టీఆర్ 
  • నవంబర్ 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్
  • నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో 'వేట్టయన్'
  • రజనీకి మరో హిట్ తెచ్చిపెట్టిన సినిమా


 వచ్చేనెల ఆరంభంలోనే రెండు భారీ సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రానున్నట్టుగా తెలుస్తోంది. ఒకటి ఎన్టీఆర్ 'దేవర' అయితే, మరొకటి రజనీకాంత్ 'వేట్టయన్. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర', సెప్టెంబర్ 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో, జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, నవంబర్ 8వ తేదీన 'నెట్ ఫ్లిక్స్' ఫ్లాట్ ఫామ్ పైకి రానున్నట్టుగా సమాచారం. 

'దేవర' సినిమా సముద్రం నేపథ్యంలో నడుస్తుంది. 'నువ్వు మంచిగా బ్రతుకుతానంటే నీకు తోడుగా నిలబడతా. నువ్వు హ్యాపీగా బ్రతకడం కోసం అన్యాయానికి పాల్పడతానంటే, అవతలవారికి అండగా నిలబడతా' అనే హీరో ఉద్దేశమే ప్రధానమైన కథాంశంగా ఈ సినిమా రూపొందింది. సముద్రం నేపథ్యంలోని సన్నివేశాలు .. ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. అలాంటి ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక వచ్చేనెల 7వ తేదీన రజనీకాంత్ 'వేట్టయన్' అమెజాన్ ప్రైమ్ నుంచి పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి టి.జి. జ్ఞానవేల్ దర్శకుడు. అక్టోబర్ 10వ తేదీన విడుదలైన ఈ సినిమాకి, థియేటర్స్ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా రజనీకాంత్ యాక్షన్ .. కథలోని ట్విస్టులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. యాక్షన్ చుట్టూ అల్లుకున్న ఎమోషన్స్ కథకి మరింత బలాన్ని చేకూర్చాయి. అలాంటి ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి మరిన్ని మార్కులు దక్కించుకునే అవకాశం ఉంది.

Ntr
Janhvi Kapoor
Rajanikanth
Vettaiyan
  • Loading...

More Telugu News