Gold: పసిడి ప్రియులకు దీపావళి ధగధగలు... దేశవ్యాప్తంగా తగ్గిన బంగారం ధరలు
- బంగారం ధరలు భారీగా తగ్గుముఖం
- భాగ్యనగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,590
- బంగారు ఆభరణాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్న మగువలు
దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దీపావళి పండగ శోభ ముందే వచ్చింది. పసిడి ధరలు తగ్గడంతో ఆభరణాలు కొనుగోలు చేసేందుకు మగువలు ఆసక్తి కనబరుస్తున్నారు.
పండగ సమయంలో బంగారం, వెండి ఆభరణాలను కొనడం ప్రజల్లో ఆనవాయతీగా వస్తున్న సంప్రదాయం. ధరలు తగ్గిన నేపథ్యంలో కొనుగోలు చేసేందుకు మరింత ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల గురించి తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,590గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే విధంగా ఉంది. అదే సమయంలో, 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.80,280 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 73,590 గా ఉంది. ఢిల్లీలో రూ.73,740... కోల్‌కతాలో రూ.73,590 గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,430గా ఉంది.
* అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, ద్రవ్యోల్బణం, రూపాయితో డాలర్ మారకం విలువ ఆధారంగా బంగారం ధరల్లో మార్పు జరుగుతుంటుంది.