MSK Prasad: అనుభ‌వం లేక‌పోయినా... అత‌డిలో టాలెంట్‌కి లోటు లేదు: ఎమ్మెస్కే ప్రసాద్

MSK Prasad talks about Nitish Kumar Reddy selections for India tour of Australia

  • ఆస్ట్రేలియా పర్యటనలో ఆడే టీమిండియాకు నితీశ్ రెడ్డి ఎంపిక
  • చాలా త్వరగా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడన్న ఎమ్మెస్కే 
  • అనుభవం లేకపోవడం ఆందోళనకరమని వెల్లడి

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ) తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి ఎంపిక‌పై మాజీ చీఫ్ సెల‌క్ట‌ర్ ఎమ్మెస్కే ప్ర‌సాద్ స్పందించారు. అత‌డిలో మంచి టాలెంట్ ఉంద‌ని... కాక‌పోతే అనుభ‌వం లేక‌పోవ‌డం వ‌ల్ల భారీ అంచనాలు పెట్టుకోకూడ‌ద‌న్నారు. హార్దిక్ పాండ్యా స్థాయిలో రాణిస్తాడ‌ని ఊహించుకోకూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఇండియా ఏ త‌ర‌ఫున ఆడే మ్యాచుల‌తో ఆసీస్ పిచ్‌ల‌పై అవ‌గాహ‌న తెచ్చుకునేందుకు అవకాశం అతడి ముందుందని ఎమ్మెస్కే ప్ర‌సాద్ అన్నారు. 

ఐదు టెస్టుల బోర్డ‌ర్ - గ‌వాస్క‌ర్ ట్రోఫీ కోసం ప్ర‌క‌టించిన జ‌ట్టులో పేస్ ఆల్‌రౌండ‌ర్‌గా నితీశ్ రెడ్డికి అవ‌కాశం క‌ల్పించారు. ఆసీస్ పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. ఈ నేప‌థ్యంలో నితీశ్ రెడ్డి ఎంపిక‌పై ఎమ్మెస్కే ప్ర‌సాద్ స్పందించారు. 

"నితీశ్‌ను చాలా త్వ‌ర‌గా టెస్టు జట్టుకు ఎంపిక చేశార‌ని అనుకుంటున్నా... ఆడే అవ‌కాశం కూడా త్వరగానే దక్కబోతోందని తెలుస్తోంది. అత‌డు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ప‌ది ఓవ‌ర్ల వ‌ర‌కు వేస్తాడ‌నే న‌మ్మ‌కంతో మేనేజ్‌మెంట్ ఉంది... హార్దిక్‌ తో పోల్చితే నితీశ్ బౌలింగ్ లో వేగం తక్కువ. అదేమంత పెద్ద విషయం కాకపోయినా, ఆసీస్ లాంటి జ‌ట్టుతో ఆడేట‌ప్పుడు అత‌డి విష‌యంలో అనుభ‌వం ఆందోళ‌న‌ కలిగిస్తుంది" అని ఎమ్మెస్కే వివరించారు. 

  • Loading...

More Telugu News