Amrapali: ఆమ్రపాలికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం... ఏ డిపార్ట్ మెంట్ అంటే...!

AP Govt gives posting to Amrapali

  • ఇటీవల తెలంగాణ నుంచి రిలీవ్ అయిన ఆమ్రపాలి
  • తాజాగా ఏపీ టూరిజం డిపార్ట్ మెంట్ లో పోస్టింగ్
  • ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్ పర్సన్, ఎండీగా నియామకం
  • వాకాటి కరుణ, వాణీ ప్రసాద్ లకు కూడా పోస్టింగ్

ఇటీవల తెలంగాణ నుంచి రిలీవ్ అయి ఏపీకి వచ్చిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి కూటమి ప్రభుత్వం తాజాగా పోస్టింగ్ ఇచ్చింది. ఆమ్రపాలిని ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్ పర్సన్, ఎండీగా నియమించింది. అంతేకాదు, ఏపీ పర్యాటక సంస్థ సీఈవోగా ఆమ్రపాలికి పూర్తి స్థాయిలో అదనపు బాధ్యతలు కేటాయించారు. ఈ మేరకు ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇటీవల తెలంగాణ నుంచి పలువురు ఐఏఎస్ లు ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమ్రపాలితో పాటు వాకాటి కరుణ, వాణీ ప్రసాద్ కూడా ఏపీలో రిపోర్ట్ చేశారు. వారికి కూడా ఇవాళ పోస్టింగ్ లు ఇచ్చారు. 

వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గా వాకాటి కరుణను నియమించారు. వాకాటి కరుణకు నేషనల్ హెల్త్ మిషనర్ డైరెక్టర్ గానూ అదనపు బాధ్యతలు కేటాయించారు. వాణీ ప్రసాద్ ను కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. వీరితోపాటు  ప్రస్తుతం  పురావస్తు  శాఖ కమిషనర్ గా పనిచేస్తున్న  జి. వాణీ మోహన్‌ను సాధారణ పరిపాలన శాఖలో సర్వీస్ వ్యవహారాల ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు.

Amrapali
Posting
AP Tourism Dept
VCMD
IAS
Andhra Pradesh
  • Loading...

More Telugu News