KCR: రాజ్ పాకాల ఫాంహౌస్ లో సోదాలు, విల్లాలో తనిఖీలపై కేసీఆర్ స్పందన

KCR reacts on latest developments

  • కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ పై పోలీసుల దాడులు
  • నేడు రాయదుర్గం ఓరియన్ విల్లాస్ వద్ద ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు
  • అడ్డుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • తాజా పరిస్థితులపై డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడిన కేసీఆర్

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ పై పోలీసు దాడులు, రాజ్ పాకాల సోదరుడి విల్లాలో ఎక్సైజ్ సిబ్బంది సోదాలపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పందించారు. ఇవాళ రాయదుర్గం ఓరియన్ విల్లాస్ వద్ద ఎక్సైజ్ సిబ్బంది సోదాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో, కేసీఆర్ తాజా పరిస్థితుల పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం కేసీఆర్ రాష్ట్ర డీజీపీ జితేందర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. తనిఖీలు చేయడానికి సెర్చ్ వారెంట్ ఉందా? వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారు? తక్షణమే సోదాలు ఆపాలి అని స్పష్టం చేశారు.

KCR
Raj Pakala
DGP
BRS
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News