Naveen vijaya krishna: సినిమా ఎడిటర్‌గా మారిపోయిన కథానాయకుడు

The protagonist turned film editor

  • 'ఎస్‌డీటీ-18' చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ విజయకృష్ణ 
  • నవీన్‌ ఆన్‌బోర్డ్‌పై ట్విట్టర్‌లో సంతోషం వ్యక్తం చేసిన హీరో 
  • పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా 'ఎస్‌డీటీ-18' చిత్రం

ఇంతకు ముందు హీరోగా పలు చిత్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సీనియర్‌ నటుడు నరేష్‌ విజయకృష్ణ తనయుడు నవీన్‌ విజయకృష్ణ ఇప్పుడు ఓ సినిమాకు ఎడిటర్‌గా మారాడు. నవీన్‌ గతంలో కూడా పలు ట్రైలర్‌ కట్‌లు చేసి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల సాయి దుర్గా తేజ్‌ (సాయి ధరమ్‌ తేజ్‌) నటించిన సత్య అనే షార్ట్‌ఫిల్మ్‌కు దర్శకత్వం కూడా వహించారు.

సైనికుల త్యాగాల గురించి, దేశభక్తి నేపథ్యంలో రూపొందించిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను పలు ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో కూడా ప్రదర్శించారు. తాజాగా నవీన్‌ విజయ కృష్ణ, సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న 'ఎస్‌డీటీ -18' చిత్రానికి ఎడిటర్‌ మారాడు. రోహిత్ కేపీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్ చిత్ర నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రానికి నవీన్‌ ఎడిటర్‌గా ఆన్‌బోర్డ్‌ కావడంపై హీరో సాయి దుర్గా తేజ్‌ ట్విట్టర్‌ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

 ''నా సోదరుడు, నా స్నేహితుడు నాకెరీర్‌లో అత్యంత కీలకంగా భావిస్తున్న నా 'ఎస్‌డీటీ -18' చిత్రానికి జాయిన్‌ కావడం ఆనందంగా ఉంది. నా కోసం ఎప్పుడూ ఓ పిలుపు దూరంలోనే ఉండే ఇలాంటి స్నేహితుడు నా కోసం ఏమైనా చేస్తాడని మరోసారి ప్రూవ్‌ చేశాడు" అంటూ తన ఎక్స్‌ ఖాతాలో సాయి దుర్గా తేజ్‌ పోస్ట్‌ చేశాడు. లక్ష్మీ మీనన్‌ నాయికగా నటిస్తున్న ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రానికి కాంతార ఫేమ్‌ అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. 

Naveen vijaya krishna
Sdt18
Sai durgha tej
sdt
Sai Dharam Tej
Sai dharam tej latest news
Cinema
  • Loading...

More Telugu News