Renu Desai: రామ్ చరణ్-ఉపాసన పెంపుడు శునకం రైమ్ కు థాంక్స్ చెప్పిన రేణూ దేశాయ్... పోస్టు వైరల్

Renu Desai thanked Rhyme the pet of Ram Charan and Upasana

  • కుమార్తె పేరు మీద యానిమల్ షెల్టర్ స్థాపించిన రేణూ దేశాయ్
  • అంబులెన్స్ ను విరాళంగా ఇచ్చిన రైమ్
  • ముగ్ధురాలైన రేణూ దేశాయ్

ప్రముఖ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ జంతు ప్రేమికురాలన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె తన కుమార్తె ఆద్య పేరు మీద 'శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్' అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించారు. ఈ ఎన్జీవో జంతువుల కోసం పాటుపడుతుంది. కుక్కలు, పిల్లులు, ఇతర సాధారణ జంతువులకు ఈ ఎన్జీవో ద్వారా ఆశ్రయం కల్పిస్తారు. 

అయితే, రేణూ దేశాయ్ స్థాపించిన 'శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్' కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతుల పెంపుడు శునకం 'రైమ్' ఓ అంబులెన్స్ ను విరాళంగా అందించింది. 

వాస్తవానికి ఇలాంటి జంతువుల షెల్టర్ లకు అంబులెన్స్ అవసరం ఎంతో ఉంటుంది. గాయపడిన జంతువులను పునరావాస కేంద్రానికి తరలించడానికి అంబులెన్స్ ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో, రైమ్ అందించిన విరాళం పట్ల రేణూ దేశాయ్ ముగ్ధురాలయ్యారు. అందుకే ఆమె సోషల్ మీడియా వేదికగా రైమ్ కు, ఉపాసనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది. 

మెగా, పవర్ స్టార్ అభిమానులు ఈ పోస్ట్ ను విపరీతంగా లైక్ చేస్తున్నారు. రేణూ దేశాయ్ గొప్ప మనసుతో యానిమల్ షెల్టర్ స్థాపించడం, అందుకు రైమ్ పేరిట రామ్ చరణ్-ఉపాసన దంపతులు అంబులెన్స్ ను అందించడం వారి సేవా భావానికి నిదర్శనం అని కొనియాడుతున్నారు.

  • Loading...

More Telugu News