HYDRA: కూల్చివేతలు, కూల్చివేశాక వదిలేసే వ్యర్థాలపై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు

HYDRA commissioner comments on demolitions and westage
  • అనుమతులు ఉన్న భవనాలను కూల్చివేయబోమని తెలిపిన హైడ్రా
  • తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది ఉంటే చర్యలు ఉంటాయని వెల్లడి
  • వ్యర్థాలను తొలగించే బాధ్యత బిల్డర్లదేనన్న హైడ్రా కమిషనర్
  • హైడ్రా తొలగిస్తే మాత్రం ఖర్చును నిర్మాణదారుడు భరించాల్సి ఉంటుందని వెల్లడి
కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి స్పష్టతనిచ్చారు. ప్రభుత్వ అనుమతులు ఉన్న భవనాలను హైడ్రా కూల్చివేయదని హామీ ఇచ్చారు. సర్వే నెంబర్లు మార్చి, తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది ఉంటే కనుక చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. తప్పుడు అనుమతులతో చెరువులు, నాలాలను ఆక్రమించిన నిర్మాణాలు కూల్చుతామని వెల్లడించారు. హైడ్రా వంద రోజులు పూర్తి చేసుకుందన్నారు.

హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చుతుందని, ఆ తర్వాత వ్యర్థాలను తొలగించే బాధ్యత బిల్డర్లదే అన్నారు. వ్యర్థాలను తొలగించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విలువైన వస్తువులను తీసుకెళ్లి... మిగతా వ్యర్థాలను వదిలేస్తే హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. అలా కాని పరిస్థితుల్లో వ్యర్థాలను హైడ్రా తొలగిస్తే అందుకయ్యే ఖర్చును నిర్మాణదారుడి నుంచి వసూలు చేస్తామన్నారు.
HYDRA
Telangana
Ranganath
Hyderabad

More Telugu News