Rachel Gupta: దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం.. 70 దేశాల భామలను వెనక్కి నెట్టి క్రౌన్ అందుకున్న రేచల్‌ గుప్తా

Rachel Gupta Wins Miss Grand International 2024 Crown
  • బ్యాంకాక్‌లో జరిగిన ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024’ పోటీలు
  • ఈ విజయంతో ‘గ్రాండ్ పీజెంట్ చాయిస్’ అవార్డు కూడా రేచల్ సొంతం
  • ఈ అవార్డుతో మాజీ మిస్ యూనివర్స్ లారా దత్తా సరసన రేచల్
  • గతంలోనూ పలు అందాల పోటీల్లో అవార్డులు గెల్చుకున్న పంజాబ్ భామ
  • గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రపంచ శాంతి, స్థిరత్వంపై ప్రచారం
పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల రేచల్ గుప్తా ప్రతిష్ఠాత్మక ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024’ కిరీటాన్ని అందుకున్నారు. బ్యాంకాక్‌లో జరిగిన ఈ పోటీల్లో 70 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్నారు. వారందరినీ వెనక్కి నెట్టి రేచల్ టైటిల్ సాధించారు. ఈ విజయంతో రేచల్ ‘గ్రాండ్ పీజెంట్ చాయిస్’ అవార్డును కూడా గెలుచుకుని మిస్ యూనివర్స్ 2000 లారా దత్తా సరసన చేరారు.

ఈ విజయాన్ని రేచల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారి గోల్డెన్ క్రౌన్‌ను గెలుచుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న రేచల్ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలకు అర్హత సాధించారు. 

రేచల్ 2022లో ‘మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ద వరల్డ్’ టైటిల్ కూడా సాధించారు. ఇన్‌స్టాలో ఆమెకు మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 విజేతగా నిలిచిన ఆమె గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రపంచ శాంతి, స్థిరత్వంపై ప్రచారం కల్పిస్తారు.
Rachel Gupta
Miss Grand International 2024
Punjab
Grand Pageants Choice Award

More Telugu News