AP govt: ఏపీ సర్కార్ కీలక ప్రకటన .. భవన నిర్మాణాలు, లేఅవుట్ అప్రూవల్ సేవలకు బ్రేక్

ap government changes in online portal which issuing permits for building structures and layouts

  • ఏపీ పట్టణ ప్రణాళిక విభాగం కీలక ప్రకటన
  • అన్‌లైన్‌లో లేఅవుట్ అప్రూవల్ సేవల నిలిపివేత
  • అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్‌లో ఉన్న డేటాను స్టేట్ డేటా సెంట‌ర్‌కు బ‌ద‌లాయిస్తున్నట్టు వెల్లడి

ఏపీ ప్రభుత్వ పట్టణ ప్రణాళిక విభంగా కీలక ప్రకటన విడుదల చేసింది. భ‌వ‌న నిర్మాణాలు, లే అవుట్ల‌ ఆన్‌లైన్ అనుమ‌తుల పోర్ట‌ర్‌లో మార్పులు చేస్తున్న కారణంగా సేవలను నిలుపుదల చేసింది. ఈ మేరకు ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక విభాగం డైరెక్ట‌ర్ విద్యుల్ల‌త శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

సర్వర్ మైగ్రేషన్, డేటా మైగ్రేషన్‌లో భాగంగా వచ్చే నెల (నవంబర్) 4వ తేదీ వరకూ సేవలు అందుబాటులో ఉండవని ఆమె పేర్కొన్నారు.  ప్రస్తుతం భవన నిర్మాణాలు, లేఅవుట్ అప్రూవల్స్‌ను ఏపీడీపీఎంఎస్ (ఏపీడీపీఎంఎస్) వెబ్ పోర్ట‌ల్ ద్వారా జారీ చేస్తున్నారు. 

ప్ర‌స్తుతం అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్‌లో ఉన్న పట్టణ ప్రణాళిక విభాగం డేటాను స్టేట్ డేటా సెంట‌ర్‌కు బ‌ద‌లాయిస్తున్నామని ఆమె తెలిపారు. తిరిగి వెబ్‌సైట్ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత భ‌వ‌న, లేఅవుట్ల‌కు య‌థావిధిగా ఆన్‌లైన్‌లో అనుమ‌తులు జారీ చేస్తామని పేర్కొన్నారు. ప్రజ‌లు, బిల్డ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్స్, ఇంజినీర్లు ఈ విషయాన్ని గ‌మ‌నించి సహకరించాలని కోరారు.

  • Loading...

More Telugu News