Jangaon District: జనగామలో రెండు షాపింగ్ మాల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

Fire accident in Jangaon shopping malls

  • సిద్దిపేట మార్గంలోని బట్టల దుకాణంలోప్రమాదం
  • విజయ షాపింగ్ మాల్‌లో మంటలు... పక్కనే ఉన్న శ్రీలక్ష్మి మాల్‌కూ అంటుకున్నవైనం
  • ఈ తెల్లవారుజామున విద్యుదాఘాతంతో చెలరేగిన మంటలు

తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రంలో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బస్టాండ్‌కు కొద్దిదూరంలో సిద్దిపేట వెళ్లే మార్గంలో విజయ షాపింగ్ మాల్, శ్రీలక్ష్మి షాపింగ్ మాల్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రెండు షాపింగ్ మాల్స్ పక్కపక్కనే ఉన్నాయి. మొదట విజయ షాపింగ్ మాల్‌లో మంటలు చెలరేగగా, ఆ తర్వాత పక్కనే ఉన్న శ్రీలక్ష్మి బట్టల దుకాణానికి అంటుకున్నాయి. విద్యుదాఘాతం వల్లే మంటలు చెలరేగినట్టు అనుమానిస్తున్నారు. గమనించిన స్థానికులు.. పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

జనగామ సీఐ దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. జనగామ ఫైరింజన్లు సరిపోకపోవడంతో పక్కనే ఉన్న స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, ఆలేరు ప్రాంతాల నుంచి రప్పించి మంటలను అదుపు చేశారు. ప్రమాదం కారణంగా రెండు బట్టల దుకాణాల్లో రూ.10 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.

Jangaon District
Fire Accident
Telangana
Shopping Mall

More Telugu News