Nara Lokesh: ఈక్వెనెక్స్ డేటా సెంటర్‌ను సందర్శించిన మంత్రి లోకేశ్

Minister Nara Lokesh visited Equinex Data Centre in USA

  • సంస్థ ప్రతినిధులతో భేటీ
  • ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటుకు ఉన్న అనుకూలతల వివరణ
  • రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం

అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో ప్రపంచ ప్రఖ్యాత డేటా సేవల సంస్థ ‘ఈక్వెనెక్స్ డేటా సెంటర్’ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తమ కంపెనీ అందిస్తున్న డాటా సేవలు, కార్యకలాపాలను సంస్థ గ్లోబల్ ఎండీ కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లోకేశ్‌కు వివరించారు.
 
ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన, సురక్షితమైన డాటా సేవలను అందిస్తున్న సంస్థగా ఈక్వెనెక్స్‌కు పేరుందని వారు తెలిపారు. తమ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 260కి పైగా ఇంటర్నేషనల్ బిజినెస్ ఎక్స్చేంజి డేటాసెంటర్ల నెట్ వర్క్ ఉందని వివరించారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టండి..
మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను వివరించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ పాలసీలో పవర్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలతో పాటు మెరుగైన ప్రోత్సాహకాలు ఉన్నాయనన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారని వారికి వివరించారు. భారత్‌లో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన వాతావరణం నెలకొని ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ ఆహ్వానం పలికారు. ఈక్వెనెక్స్ ముందుకు వస్తే తాము అన్ని విధాలా సహాయ, సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

Nara Lokesh
Equinex Data Centre
USA
Andhra Pradesh
Telugudesam
  • Loading...

More Telugu News