Telangana: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- నాలుగు గంటలపాటు సాగిన కేబినెట్ భేటీ
- ఏటూరునాగారంను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తూ కేబినెట్ తీర్మానం
- సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీకి 211 ఎకరాలను అప్పగిస్తూ తీర్మానం
- మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ ఆమోదం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ శనివారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీ దాదాపు నాలుగు గంటలకు పైగా కొనసాగింది.
ఏటూరునాగారంను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీకి 211 ఎకరాలను అప్పగిస్తూ తీర్మానం చేసింది. మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకటి నాగోల్-ఎల్బీ నగర్-హయత్ నగర్, రెండోది ఎల్బీ నగర్-శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు ఆమోదం తెలిపింది.
బాలకృష్ణ స్టూడియోకు భూమి అంటూ జోరుగా ప్రచారం
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లో స్టూడియో నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం భూకేటాయింపులు చేయనుందని మీడియాలో, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. తెలంగాణలో బాలయ్య కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 500 ఎకరాలను కేటాయించనుందని, ఈ భూకేటాయింపుకు సంబంధించి ప్రతిపాదనకు రెవెన్యూ శాఖ ఆమోదముద్ర వేసిందని కూడా ప్రచారం సాగుతోంది.