Johnny Master: 37 రోజుల్లో ఎంతో కోల్పోయాను: జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్

Johnny Master emotional post

  • లైంగిక వేధింపుల కేసులో అరెస్టై... నిన్న జైలు నుంచి విడుదలైన జానీమాస్టర్
  • నిజం అనేది ఏదో ఒకరోజు బయటపడుతుందన్న కొరియోగ్రాఫర్
  • ఫ్యామిలీ పడిన కష్టం ఎప్పటికీ వేదనకు గురి చేస్తుందని వ్యాఖ్య

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్ నిన్న బెయిల్‌పై విడుదలయ్యారు. జానీ మాస్టర్ నెల రోజులకు పైగా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఓ పోస్ట్ పెట్టారు.

37 రోజుల్లో తాను ఎంతో కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల ప్రార్థనల వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నానని పేర్కొన్నారు. నిజం అనేది ఏదో ఒకరోజు బయటపడుతుందని రాసుకొచ్చారు. తన ఫ్యామిలీ పడిన కష్టం... తనను ఎప్పటికీ వేదనకు గురి చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.

Johnny Master
Telangana
Tollywood
  • Loading...

More Telugu News