Devendra Fadnavis: మహా డిప్యూటీ సీఎం కంటే ఆయన భార్యే ధనవంతురాలు!

Wife richer than Dy CM Fadnavis

  • నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఫడ్నవీస్
  • 2019తో పోలిస్తే భారీగా పెరిగిన ఫడ్నవీస్ దంపతుల ఆస్తులు
  • అమృత పేరు మీద రూ.2.33 కోట్ల షేర్లు, మ్యూచువల్ ఫండ్స్
  • సొంత కారు లేదని అఫిడవిట్‌లో తెలిపిన ఫడ్నవీస్

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఫడ్నవీస్ శుక్రవారం తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అఫిడవిట్ ప్రకారం ఫడ్నవీస్ కంటే ఆయన భార్య అమృతకు ఎక్కువ ఆస్తులు ఉన్నాయి.

2019తో పోలిస్తే 2024 నాటికి ఫడ్నవీస్ ఆస్తులు భారీగా పెరిగాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఫడ్నవీస్ ఆదాయం రూ.1.24 లక్షలు కాగా, ఆయన భార్య ఆదాయం రూ.18.27 లక్షలుగా ఉంది. 

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫడ్నవీస్ ఆదాయం రూ.38.73 లక్షలు కాగా, భార్య ఆదాయం రూ.79.30 లక్షలకు పెరిగింది.

2019-20 నుంచి 2023-24 కాలంలో ఫడ్నవీస్ ఆదాయం రూ.1.66 కోట్లు కాగా, ఇదే కాలంలో ఆయన భార్య ఆదాయం రూ.5.05 కోట్లుగా ప్రకటించారు. తనకు రూ.62 లక్షల రుణాలు, తనపై నాలుగు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఫడ్నవీస్ పేర్కొన్నారు. 

అఫిడవిట్ ప్రకారం ఫడ్నవీస్ కంటే ఆయన భార్య అమృత ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. గత ఐదేళ్ల కాలంలో వీరి ఆదాయం రూ.4.57 కోట్లు పెరిగింది. తమకు రూ.13.27 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ల్యాండ్, 1.35 కిలోల బంగారం ఉందని తెలిపారు. తమకు సొంత కారు లేదని పేర్కొన్నారు.

2019 అఫిడవిట్ ప్రకారం అమృతకు రూ.2.33 కోట్ల షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. 2024 నాటికి షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.5.62 కోట్లకు పెరిగింది. 

2019లో ఫడ్నవీస్ రూ.45.94 లక్షలు, అమృత రూ.3.39 కోట్ల చరాస్తులు కలిగి ఉన్నారు. అయితే వీరి చరాస్తులు 2024 నాటికి రూ.7.52 కోట్లకు పెరిగాయి. 2019లో ఫడ్నవీస్ పేరిట రూ.3.78 కోట్లు, అమృత పేరిట రూ.99.39 లక్షల చరాస్తులు ఉండగా, 2024 నాటికి ఇరువురి చరాస్తుల విలువ రూ.5.63 కోట్లకు పెరిగింది.

  • Loading...

More Telugu News