Sujeeth: ద‌ర్శ‌కుడు సుజిత్ బ‌ర్త్‌డే... పవ‌న్ 'ఓజీ' నుంచి స్పెష‌ల్ వీడియో విడుద‌ల‌

Happy Birthday Sujeeth specia Video from OG

  • ప‌వ‌న్, సుజీత్ కాంబోలో 'ఓజీ'
  • గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో సినిమా
  • ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో మూవీ షూటింగ్
  • సుజీత్‌కు బ‌ర్త్‌డే విషెస్‌ తెలుపుతూ డీవీవీ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ ప్ర‌త్యేక వీడియో

టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు సుజీత్ త‌న తొలి చిత్రం 'ర‌న్ రాజా ర‌న్‌'తో మంచి హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. దాంతో రెండో చిత్రానికి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌ను డైరెక్ష‌న్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అలా ఈ ఇద్ద‌రి కాంబోలో వ‌చ్చిందే 'సాహో' సినిమా. కానీ, ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడ‌లేదు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ స‌క్సెస్ కాక‌పోవ‌డంతో సుజీత్‌కు అవ‌కాశాలు రాలేదు. 

ఈ క్ర‌మంలో సుజీత్‌ ఎలాగోలా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను త‌న క‌థ‌తో ఒప్పించాడు. అత‌డి దర్శకత్వంలో పవన్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌). జపాన్‌ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. 

ఏపీ ఎన్నిక‌ల కార‌ణంగా మ‌ధ్య‌లో కొన్ని రోజులు షూటింగ్ నిలిచిపోయింది. చిత్ర యూనిట్‌ ఇటీవ‌లే మ‌ళ్లీ షూటింగ్ ప్రారంభించింది. ప్ర‌స్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉంటే... నేడు ద‌ర్శ‌కుడు సుజీత్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా అతనికి బ‌ర్త్‌డే విషెస్‌ తెలుపుతూ... ఓజీని నిర్మిస్తున్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ మూవీ నుంచి స్పెష‌ల్ వీడియోను పంచుకుంది. 

ఇక, ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తుంది. ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ల్లో ప్ర‌ముఖ‌ బాలీవుడ్ న‌టుడు ఇమ్రాన్ హ‌ష్మీ న‌టిస్తున్నారు. ఒమీ భావు అనే గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో ఆయ‌న‌ క‌నిపించ‌నున్నారు. అలాగే ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్ న‌టిస్తున్నారు. 

ఈ చిత్రానికి ఎస్ఎస్ థ‌మ‌న్ బాణీలు అందిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుద‌ల కాగా, ప‌వ‌ర్‌స్టార్‌ అభిమానులను బాగా అలరించాయి. దీంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. 

  • Loading...

More Telugu News