Nara Lokesh: రూ.100తో టీడీపీ సభ్యత్వం తీసుకోండి: నారా లోకేశ్

Nara Lokesh calls for TDP Membership

  • టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభమైందన్న లోకేశ్
  • రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా ఉంటుందని వెల్లడి
  • సభ్యత్వం తీసుకోవడం ద్వారా టీడీపీ కార్యకర్తనని ఘనంగా చాటాలని పిలుపు

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వివరాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా... పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది అని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ రూ.100తో టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, కుటుంబ సభ్యులకు విద్య, ఉద్యోగ, వైద్య సదుపాయం అందుతుందని వివరించారు. 

దేశంలో మరే ఇతర రాజకీయ పార్టీ చేయని రీతిలో కార్యకర్తల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన చరిత్ర మన తెలుగుదేశం పార్టీది అని లోకేశ్ పేర్కొన్నారు. సభ్యత్వం తీసుకోండి... తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని ఘనంగా చాటండి అంటూ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. 

టీడీపీ సభ్యత్వాన్ని మొబైల్ లేదా కంప్యూటర్ పై వాట్సాప్ ద్వారా https://bit.ly/4eK2Lj5 లింక్ ను ఉపయోగించి పొందవచ్చని, లేదా https://telugudesam.org/membership-2024-26/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఆన్ లైన్లోనే తీసుకోవచ్చని లోకేశ్ వివరించారు. పాత సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవచ్చని తెలిపారు.

Nara Lokesh
TDP Membership
Party Workers
Andhra Pradesh
  • Loading...

More Telugu News