Simi High Speed Rail Corridor: శంషాబాద్ నుంచి రైలులో విశాఖకు నాలుగు గంటల్లోనే.. ఖరారైన కొత్త రైల్వే మార్గం

Simi High Speed Rail Corridor Between Shamshabad And Visakhapatnam

  • శంషాబాద్-దువ్వాడ మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్
  • నాలుగు గంటలకు తగ్గిపోనున్న రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం
  • విశాఖ-సూర్యాపేట మధ్య రైలు కారిడార్
  • ఇప్పటి వరకు రైలు అన్నదే తెలియని తెలంగాణలోని పలు ప్రాంతాల ద్వారా రైలు మార్గం
  • నవంబర్‌లో రైల్వే బోర్డుకు నివేదిక

హైదరాబాద్‌లోని శంషాబాద్-విశాఖపట్టణం (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్‌మెంట్ ఖరారైంది. ఇది పూర్తయితే శంషాబాద్ నుంచి విశాఖపట్టణానికి కేవలం 4 గంటల్లోనే చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి 12 గంటల సమయం పడుతుండగా, వందేభారత్ రైలు 8.30 గంటల సమయం తీసుకుంటోంది. సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రస్తుతం వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గంతోపాటు నల్గొండ, గుంటూరు, విజయవాడ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడీ ప్రతిపాదిత లైను మూడోది. ఈ మార్గంలో రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. 12 స్టేషన్లు ఉంటాయి. తెలుగు రాష్ట్రాలో ఇదే తొలి సెమీ హైస్పీడ్ కారిడార్ కానుంది.

విశాఖపట్టణం నుంచి విజయవాడ, సూర్యాపేట మీదుగా కర్నూలుకు మరో కారిడార్ నిర్మిస్తారు. ఇది విశాఖ నుంచి ప్రారంభమై సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు మీదుగా కర్నూలు చేరుకుంటుంది. ఈ మార్గంలో మొత్తం 8 రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గం ద్వారా తెలంగాణలో ఇప్పటి వరకు రైలు అన్నదే తెలియని అనేక ప్రాంతాలకు రైలు సదుపాయం. అది కూడా సెమీ హైస్పీడ్ కారిడార్ అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్ (పెట్) సర్వే తుది దశకు చేరుకుంది. నవంబర్‌లో రైల్వే బోర్డుకు ఈ నివేదికను సమర్పిస్తారు.

  • Loading...

More Telugu News