KTR: ఫోన్ ట్యాపింగ్... సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు

KTR allegations on CM Revanth Reddy over Phone Tapping
  • మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు, తన ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారన్న కేటీఆర్
  • దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని ప్రకటన చేయాలని సవాల్
  • రూ.50 లక్షల బ్యాగుతో దొరికిన వ్యక్తిని దొంగ అనకుంటే ఏమంటారని ఎద్దేవా
సీఎం రేవంత్ రెడ్డి... రాష్ట్ర మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, తనతో సహా ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మంత్రుల ఫోన్లతో పాటు తన ఫోన్ ను ట్యాపింగ్ చేయడం లేదని సీఎం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

దమ్ముంటే ఆయన కెమెరాల ముందు లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. తాను కూడా సిద్ధమే అన్నారు. హైదరాబాద్‌లో ఏబీపీ సదరన్ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు.

రేవంత్ రెడ్డి బాధ్యతాయుతమైన సీఎం పదవిలోకి వచ్చాక కూడా నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజాప్రతినిధిని కొనుగోలు చేసేందుకు రూ.50 లక్షల బ్యాగుతో పట్టుబడిన వ్యక్తిని దొంగ అనకుండా ఇంకేమని అంటారని ఎద్దేవా చేశారు.

నాడు మండలి సభ్యులను కొనుగోలు చేసే ప్రయత్నం చేశాడు కాబట్టే ఆయనపై కేసు పెట్టాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పది నెలల కాలంలో అన్నింటా విఫలమైందని విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు నెరవేరుస్తామని చెప్పి... అమలు చేయలేకపోయారన్నారు.

 మరోవైపు, ఈ సదస్సుకు హాజరైన యువత... కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడింది.
KTR
Revanth Reddy
Telangana
Kinjarapu Ram Mohan Naidu

More Telugu News