Sand Seigniorage: ఇసుక సీనరేజి ఫీజు మాఫీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP Govt issues orders on sand seigniorage fee

  • ఏపీలో ఉచిత ఇసుక పాలసీ తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం
  • సీనరేజి రద్దుపై ఇటీవల క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం
  • సీనరేజి చెల్లించాల్సిన అవసరం లేకుండానే నిర్మాణ అవసరాలకు ఇసుక

ఉచిత ఇసుక పాలసీలో సీనరేజి రుసుం రద్దు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇవాళ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఇసుక సీనరేజి ఫీజు మాఫీ చేస్తూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా జీవో జారీ విడుదల చేశారు. 

ఈ నెల 21న జరిగిన క్యాబినెట్ భేటీలో ఇసుక పాలసీపై తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేలా ఈ జీవో రూపొందించారు. సీనరేజి ఫీజు, మెరిట్ ఆన్ శాండ్, డీఎంఎఫ్ మాఫీకి చర్యలు తీసుకున్నారు. ఇకపై సీనరేజి రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే నిర్మాణ అవసరాలకు ఇసుక తీసుకెళ్లవచ్చు. 

అదే సమయంలో, ఇసుక అక్రమ రవాణా కట్టడికి విజిలెన్స్ వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జీపీఎస్, చెక్ పోస్టుల వద్ద పటిష్ట తనిఖీలు చేయనున్నారు. 

ఇసుక లభ్యత పెంచేలా పాలసీలో మార్పులు చేస్తూ ఆ మేరకు ఉత్తర్వులు వెలువరించారు. ఇసుక లభ్యం కాని జిల్లాల్లో స్టాక్ యార్డులు ఏర్పాటు చేయనున్నారు. విజిలెన్స్ మానిటరింగ్ విధానాల్లో మార్పులను కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News