Kannappa: కన్నప్ప విడుదలకు ముందే 12 జ్యోతిర్లింగాలను సందర్శించాలన్నది నా లక్ష్యం: మంచు విష్ణు

Kannappa team ends spiritual journey at Rishikesh

  • కన్నప్ప టీమ్ ఆధ్యాత్మిక యాత్ర
  • రిషికేశ్ సందర్శనతో ముగిసిన ప్రయాణం
  • ఎంతో ఆనందంగా ఉందన్న మంచు విష్ణు

ఇవాళ కన్నప్ప చిత్రబృందం సభ్యులు కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను సందర్శించారు. ప్రముఖ నటుడు మోహన్ బాబు, మంచు విష్ణు, దర్శకుడు ముఖేశ్ కుమార్, నటుడు అర్పిత్ రంకాతో కలిసి కేదార్‌నాథ్, బద్రీనాథ్ రిషికేశ్‌లో ఆధ్యాత్మిక తీర్థయాత్రకు బయలుదేరారు. 

ఈ బృందం దైవిక ఆశీర్వాదం కోసం ఈ పవిత్ర యాత్రను చేపట్టింది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ను కన్నప్ప టీం సందర్శించింది. ఆపై బద్రీనాథ్‌లో ప్రార్థనలు కూడా చేశారు. రిషికేశ్ సందర్శనతో వారి ప్రయాణం ముగిసింది. 

అనంతరం విష్ణు మంచు మాట్లాడుతూ... "కేదార్‌నాథ్, బద్రీనాథ్, రిషికేశ్‌కు రావడం ఆనందంగా ఉంది. పరమ శివుడి పరమ భక్తుడి కథగా కన్నప్ప చిత్రం విడుదలకు ముందే మొత్తం 12 జ్యోతిర్లింగాలను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మా ఎపిక్ యాక్షన్ చిత్రం విడుదల కోసం మేము ఎదురుచూస్తున్నాం" అని అన్నారు.

మంచు విష్ణు కన్నప్ప ఫస్ట్ లుక్, టీజర్ అభిమానులలో ఉత్సాహాన్ని నింపిన సంగతి తెలిసిందే. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి ఇతిహాసాల స్ఫూర్తితో, ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ కెమెరా వర్క్ తో న్యూజిలాండ్‌లోని సుందరమైన ప్రకృతి దృశ్యాలలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం విజువల్ వండర్‌గా రాబోతోంది.  

ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్‌, శరత్ కుమార్ తో సహా భారీ తారాగణం ఉంది. కథానాయకుడిగా నటిస్తున్న విష్ణు మంచు ఈ చిత్రాన్ని... భక్తి, శౌర్యం, ఆధ్యాత్మిక అన్వేషణతో కూడిన ప్రయాణంగా అభివర్ణించారు.

Kannappa
Manchu Vishnu
Spiritual journey
Rishikesh
Tollywood
  • Loading...

More Telugu News