Threat Call: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

Hoax bomb call to Indigo plane at Shamshabad airport

  • ఇటీవల దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు
  • కొన్ని రోజుల వ్యవధిలోనే వందల కొద్దీ బెదిరింపు కాల్స్
  • హైదరాబాద్ నుంచి ఛండీగఢ్ వెళుతున్న విమానానికి బెదిరింపు
  • విమానంలో 130 మంది ప్రయాణికులు

గత కొన్ని రోజులుగా దేశంలో విమానాలకు బెదిరింపులు రావడం తీవ్రమైంది. స్వల్ప వ్యవధిలోనే వందల కొద్దీ బెదిరింపు కాల్స్ వస్తుండడం కేంద్ర పౌరవిమానయాన శాఖకు తలనొప్పిగా మారింది. కాల్ వచ్చిన ప్రతిసారి విమానాలను తనిఖీ చేయడం, ఏమీ లేదని తేలడం... ఇదొక నిత్య ప్రహసనంలా మారింది. 

తాజాగా, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. ఆ విమానం హైదరాబాద్ నుంచి ఛండీగఢ్ వెళ్లాల్సి ఉంది. బెదిరింపు కాల్ నేపథ్యంలో... విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 

విమానంలో 130 మంది ప్రయాణికులు ఉండగా... వారందరినీ కిందికి దింపి, విమానంలో అణువణువు సోదా చేశారు. విమానంలో బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఇండిగో విమానం ఛండీగఢ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Threat Call
Hoax Bomb
Indigo
Shamshabad Airport
  • Loading...

More Telugu News