Team India: 7 వికెట్లతో రికార్డ్... కివీస్ బౌలర్ శాంట్నర్ దెబ్బకు కుప్పకూలిన టీమిండియా

New Zealand bundle out India for 156 in first innings
  • తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే చేతులెత్తేసిన టీమిండియా
  • 103 పరుగుల వెనుకంజలో భారత్
  • విఫలమైన కోహ్లీ, రోహిత్, సర్ఫరాజ్, రిషబ్
  • 53 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీసిన మిచెల్ శాంట్నర్
పుణే టెస్ట్‌లో టీమిండియా కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే చేతులెత్తేసింది. న్యూజిలాండ్ బౌలర్ మిచెల్ శాంట్నర్ 53 పరుగులు ఇచ్చి ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ 259 పరుగులు చేసింది. దీంతో భారత్ 103 పరుగులు వెనుకబడింది.

భార‌త బ్యాట‌ర్ల‌లో రవీంద్ర జడెజా (30), శుభ్‌మన్ గిల్ (30), యశస్వి జైశ్వాల్ (30) పరుగులు చేశారు. రోహిత్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్, రిషబ్ పంత్ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. 

ఇప్పటి వరకు భారత్‌తో జరిగిన 5 డే టెస్ట్ మ్యాచ్‌లలో 7 వికెట్లు తీసిన కివీస్ బౌలర్ల జాబితాలో మిచెల్ శాంట్నర్ నిలిచాడు. శాంట్నర్ ఈ ఇన్నింగ్స్ లో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడెజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బూమ్రా వికెట్లను తీశాడు.

టెస్టుల్లో భార‌త్‌పై న్యూజిలాండ్ బౌల‌ర్ల అత్యుత్త‌మ గ‌ణాంకాలు

2021లో వాంఖేడేలో అజాజ్ పటేల్ ఏకంగా 10 వికెట్లు తీసి 119 పరుగులు ఇచ్చాడు.
1976లో రిచర్డ్ హాడ్లీ వెల్లింగ్టన్‌లో 7 వికెట్లు తీసి 23 పరుగులు ఇచ్చాడు.
ఇప్పుడు పుణేలో మిచెల్ శాంట్నర్ 7 వికెట్లు తీసి 53 పరుగులు ఇచ్చాడు.
2012లో టిమ్ సోథి బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లు తీసి 64 పరుగులు ఇచ్చాడు.
1998లో సిమన్ డోల్ వెల్లింగ్టన్‌లో 7 వికెట్లు తీసి 65 పరుగులు ఇచ్చాడు.
Team India
Cricket
Sports News
Team New Zealand

More Telugu News