Yashasvi Jaiswal: చ‌రిత్ర సృష్టించిన‌ యశస్వి జైస్వాల్.. యువ ఆట‌గాడి పేరిట న‌యా రికార్డ్‌!

Yashasvi Jaiswal becomes youngest Indian to reach 1000 Test runs in calendar year

  • ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 1000 టెస్టు పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా జైస్వాల్ 
  • దిలీప్ వెంగ్‌సర్కార్ పేరిట ఉన్న మునుపటి రికార్డు బ్రేక్‌
  • ఈ ఏడాది 10 మ్యాచ్‌లలో 1007 పరుగులు చేసిన యువ సంచ‌ల‌నం

పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘ‌న‌త సాధించారు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 1000 టెస్టు పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

త‌ద్వారా 22 ఏళ్ల యువ సంచ‌ల‌నం 1979లో 23 ఏళ్ల వయసులో 1000 పరుగుల మార్కును చేరుకున్న దిలీప్ వెంగ్‌సర్కార్ పేరిట ఉన్న మునుపటి రికార్డును అధిగమించాడు.

ప్రస్తుతం జైస్వాల్ 2024లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లాండ్‌కు చెందిన జో రూట్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. రూట్‌ 14 మ్యాచుల్లో 1305 పరుగులు చేశాడు.

ఈ ఏడాది అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న‌ జైస్వాల్ ఇప్ప‌టివ‌ర‌కు కేవలం 10 మ్యాచ్‌లలో 59.23 స‌గ‌టుతో 1007 పరుగులు చేశాడు. ఇందులో రెండు శ‌త‌కాలు, ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

2024లో టీమిండియా మరో మూడు టెస్టులు ఆడాల్సి ఉంది. దీంతో జైస్వాల్ భారత దిగ్గజాల పేరిట ఉన్న కొన్ని అతిపెద్ద రికార్డులను అధిగమించే అవకాశం ఉంది.

ముఖ్యంగా లిటిల్ మాస్ట‌ర్‌ సచిన్ టెండూల్కర్ 2010లో 14 మ్యాచ్‌లలో 1,562 ర‌న్స్‌తో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన భారతీయ ఆట‌గాడిగా రికార్డును కలిగి ఉన్నాడు. 

అలాగే వీరేంద్ర సెహ్వాగ్ 2008లో చేసిన 1,462 పరుగులు ఒకే ఏడాదిలో ఒక భారతీయ ఓపెనర్ చేసిన అత్యధిక పరుగులు. ఈ ఏడాది మిగిలిన మూడు టెస్టు మ్యాచుల్లోని ఆరు ఇన్నింగ్స్‌ల‌లో క‌లిపి జైస్వాల్ 500 ప‌రుగులు చేస్తే ఈ రెండు రికార్డులు బ్రేక్ చేసే అవ‌కాశం ఉంది.  

  • Loading...

More Telugu News