Ka Movie Trailer: ఆస‌క్తిక‌రంగా 'క' ట్రైల‌ర్‌.. అంచ‌నాలు పెంచేలా కిర‌ణ్ అబ్బ‌వ‌రం యాక్షన్‌ సన్నివేశాలు!

Kiran Abbavaram Ka Movie Trailer Out Now

  • మూవీకి సుజిత్‌, సందీప్‌ సంయుక్తంగా దర్శకత్వం
  • దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న సినిమా విడుద‌ల
  • యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టిన హీరో కిరణ్‌ అబ్బవరం
  • కిర‌ణ్ అబ్బ‌వ‌రంకు జోడిగా తన్వీ రామ్‌ 

యువ న‌టుడు కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం 'క'. ఈ మూవీకి సుజిత్‌, సందీప్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. తాజాగా సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న ఈ సినిమా విడుద‌ల కానుంది. దాంతో రిలీజ్ తేదీ దగ్గర పడుతుండ‌డంతో చిత్రం యూనిట్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో జోరు పెంచింది. 

దీనిలో భాగంగానే తాజాగా 'క' ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది. ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ఇందులో కిరణ్‌ అబ్బవరం నటన, సంభాషణలు, యాక్షన్‌ సన్నివేశాలు సినిమాపై అంచ‌నాలు పెంచేలా ఉన్నాయి. ఈ సినిమాలో కిర‌ణ్ అబ్బ‌వ‌రంకు జోడిగా తన్వీ రామ్‌ నటించింది.

  • Loading...

More Telugu News