AP High Court: ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు

ap high court appointed three new judges

  • ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం
  • ఇటీవలే సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు
  • చల్లా గుణరంజన్, కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్ న్యాయమూర్తులుగా నియామకం 

ఆంధ్ర్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు అదనపు జడ్జిల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి చేసిన సిఫార్సు మేరకు హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను నియమించింది. ప్రస్తుతం ఏపీ హైకోర్టులోనే న్యాయవాదులుగా సేవలు అందిస్తున్న చల్లా గుణరంజన్, కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్‌ లను అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. 

రాష్ట్రపతి ఆమోదించిన విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. తాజా నియామకాలతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరుకుంది. 

AP High Court
new judges
President Of India
Droupadi Murmu
  • Loading...

More Telugu News