Pushpa2: అఫీషియల్‌: పుష్ప-2 నాన్‌ థియేట్రికల్‌ బిజినెస్‌ 420 కోట్లు

Official Pushpa2 non theatrical business 420 crores

  • పుష్ప-2 నాన్‌ థియేట్రికల్‌ బిజినెస్‌ను అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు 
  • డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 విడుదల 
  • వసూళ్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తుందంటున్న పంపిణీదారులు 

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'పుష్ప-2' ది రూల్‌. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్‌ అండ్ సుకుమార్‌ రైటింగ్స్‌లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 'పుష్ప' ది రైజ్‌ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను  సంపాందించుకున్న అల్లు అర్జున్‌ నటిస్తున్న ఈ చిత్రం గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 6న విడుదల చేస్తున్నామని మేకర్స్‌ గతంలో ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని అనుకున్న డేట్‌ కంటే ఒకరోజు ముందుగానే డిసెంబర్‌ 5న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఈ విషయాన్ని తెలిపారు. ఈ పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాతలతో పాటు పుష్ప-2 చిత్రాన్ని దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్‌ కూడా పాల్గొన్నారు. 

ఇండియా లెవల్‌లో అత్యధిక థియేటర్స్‌లో పుష్ప-2 విడుదల చేస్తున్నామని, కలెక్షన్ల పరంగా పుష్ప-2 ది రూల్‌ సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసే అవకాశం ఉందని పంపిణీదారులు తెలిపారు. 'పుష్ప-2' దిరూల్‌ చిత్రం ఊహించిన దాని కంటే పదిరెట్లు అద్భుతంగా ఉండబోతుందని, అందరి అంచనాలను పుష్ప-2 అందుకుంటుందని, దేశవ్యాప్తంగా నిర్మాతలుగా పుష్ప ఫ్రాంఛైజీ మంచి గుర్తింపు నిచ్చిందని తెలిపారు నిర్మాతలు.  

ఇక పుష్ప-2  నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ రూపంలో రూ.420 కోట్ల బిజినెస్‌ చేసిందని, థియేట్రికల్‌ బిజినెస్‌తో కలుపుకుని రూ.1000 కోట్లకు పైగా బిజినెస్ చేసిందని ఓ ప్రశ్నకు సమాధానంగా నిర్మాతలు తెలిపారు. 

  • Loading...

More Telugu News