APPSC: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా అనురాధ బాధ్యతల స్వీకరణ
![Former IPS Officer Anuradha Take Charges as APPSC Chairperson](https://imgd.ap7am.com/thumbnail/cr-20241024tn6719ff258eec7.jpg)
- బందర్ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టిన అనురాధ
- ఆమెతో పదవీ ప్రమాణస్వీకారం చేయించిన ఏపీపీఎస్సీ కార్యదర్శి జే ప్రదీప్ కుమార్
- బాధ్యతల స్వీకరణ అనంతరం ఏపీపీఎస్సీ బోర్డు సభ్యులు, అధికారులతో అనురాధ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అనురాధ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆమెతో ఏపీపీఎస్సీ కార్యదర్శి జే ప్రదీప్ కుమార్ పదవీ ప్రమాణస్వీకారం చేయించారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం ఏపీపీఎస్సీలో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న నియామకాలపై బోర్డు సభ్యులు, అధికారులతో అనురాధ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రూప్-1, గ్రూప్-2తో పాటు నిర్వహించాల్సిన పలు నియామక పరీక్షలు, ఇంటర్వ్యూలపై ఛైర్‌పర్సన్ ఆరా తీశారు.
ఇక గత వైసీపీ ప్రభుత్వం గౌతమ్ సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా అనంతరం ఈ పదవి ఖాళీగానే ఉంది. తాజాగా అనురాధను ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, అనురాధ గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్, హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.