Jani Master: జానీ మాస్టర్‌కు భారీ ఊరట.. బెయిల్‌ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

Telangana High Court Issued Bail to Choreographer Jani Master

  • జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల‌ ఆరోపణలు
  • గ‌త నెల 16న అరెస్టు చేసిన నార్సింగి పోలీసులు
  • ప్ర‌స్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న కొరియోగ్రాఫ‌ర్‌ 

లైంగిక వేధింపుల‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తనపై జానీ మాస్టర్‌ లైంగికదాడికి పాల్ప‌డిన‌ట్లు మహిళా కొరియోగ్రాఫర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెప్టెంబర్‌ 16న ఆయనపై నార్సింగి పోలీసులు 376, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. 

ఆ త‌ర్వాత కోర్టు ఆయన‌కు రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలులో ఉంటున్నారు. జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేపథ్యంలో అక్టోబ‌ర్‌ 6 నుంచి 9 వరకు జానీ మాస్ట‌ర్‌కు కోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్‌ మంజూరు చేసింది. ఆ గడువు ముగిసిన త‌ర్వాత‌ మళ్లీ జైలుకు వెళ్లారు. 

తాజాగా ఆయనకు తెంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో జానీ మాస్ట‌ర్ ఈరోజు సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంద‌ని స‌మాచారం.

  • Loading...

More Telugu News