Cyclone Dana: దానా తుపానుకి ఆ పేరు ఎలా వచ్చింది? అర్థం ఏమిటి?

Arabic word Dana Proposed by Qatar and its meaning is beautiful pearl

  • దానా పదాన్ని ప్రతిపాదించిన గల్ఫ్ దేశం ఖతార్
  • అరబిక్ భాషలో దానా అంటే అందమైన ముత్యం, విలువైనది అని అర్థం
  • గల్ఫ్ దేశాల్లో స్త్రీలకు ఈ పదంతో పేర్లు పెట్టడం సర్వసాధారణం

తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘దానా’ తీవ్రంవైపు దూసుకోస్తోంది. ఇవాళ (గురువారం) రాత్రికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. కాగా ఈ తీవ్ర తుపానుకు ‘దానా’ అనే పేరు ఎలా వచ్చింది? దీని అర్థం ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది. ‘దానా’ అనేది అరబిక్ పదం. ఈ పదాన్ని ఖతార్ ప్రతిపాదించింది. అరబిక్ భాషలో ఈ పదానికి ‘అత్యంత సంపూర్ణ పరిమాణం, అందమైన ముత్యం, విలువైనది అనే అర్థాలు వస్తాయి. దానా పదాన్ని స్త్రీలకు పేరుగా పెడుతుంటారు. అరబ్ దేశాలలో ఈ పేరు సర్వసాధారణం. ఇక పర్షియన్ భాషలో ‘దానా’ అంటే విరాళం, దానం వంటి అర్థాలు ఉన్నాయి.

తుపానులను సులువుగా గుర్తించడం, ముప్పు నుంచి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ విధంగా పేర్లు పెడుతున్నారు. తుపానులకు సంబంధించి దేశాల మధ్య మెరుగైన సమాచారం పంపిణీ కూడా ఒక కీలక లక్ష్యంగా ఉంది. ఈ విధంగా పేర్లు పెట్టడం ద్వారా తుపానులను ట్రాక్ చేయడం‌తో పాటు మీడియాకు సులువుగా సమాచారం అందించేందుకు వీలుంటుంది. 

ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుపానులకు పేర్లు పెట్టేందుకు ఏప్రిల్ 2020లో 13 దేశాలు సమూహంగా ఏర్పడ్డాయి. ఈ జాబితాలో భారత్, బంగ్లాదేశ్, ఖతార్‌తో పాటు ఇతర దేశాలు ఉన్నాయి. అయితే ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తుపానుల నామకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షిస్తుంది. పేర్లు సాంస్కృతికంగా తటస్థంగా, పలకడానికి సులభంగా, ఏ వర్గాన్ని కించపరచకుండా ఉండాలని సూచనలు చేసింది. ఈ ప్రమాణాలకు అనుగుణంగా దేశాలు పదాలను సూచిస్తుంటాయి. అంతర్జాతీయ నామకరణ విధానానికి అనుగుణంగా ‘దానా’ పదాన్ని ఖతార్ ప్రతిపాదించింది.

  • Loading...

More Telugu News