Andhra Pradesh: ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, శారదా పీఠానికి ఇచ్చిన భూమి వెనక్కి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

AP Cabinet Nod to Distribute 3 Free Gas Cylinders

  • చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
  • గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లో ఖాతాల్లో నగదు జమ 
  • శారదా పీఠానికి ఇచ్చిన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం

దీపావళి నుంచి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే విశాఖలో శారదాపీఠానికి భూకేటాయింపును రద్దు చేసింది. ఏపీ స‌చివాల‌యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ స‌మావేశమైంది. కేబినెట్ భేటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు, అధికారులు హాజ‌ర‌య్యారు. ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఉచిత గ్యాస్ సిలిండర్ అమలులో భాగంగా నగదు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లో వారి ఖాతాలో నగదు జమయ్యేలా చూడాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై ఏడాదికి రూ.2,700 కోట్ల భారం పడుతుందని కేబినెట్ పేర్కొంది. 

ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకోవడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించేందుకు, సభ్యుల సంఖ్యను పెంచేందుకు చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి గత జగన్ ప్రభుత్వం ఇచ్చిన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News