Sajjanar: విద్యార్థుల ఫుట్‌బోర్డు ప్రయాణం... స్పందించిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Sajjanar responds on students foot board travelling

  • రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామన్న సజ్జనార్
  • బస్సుల సంఖ్యను పెంచాలని యాజమాన్యం నిర్ణయించిందని వెల్లడి
  • విద్యార్థులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ కట్టుబడి ఉందని వెల్లడి

టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులు ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తోన్న వీడియోలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఓ బస్సులో కొంతమంది విద్యార్థులు ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తోన్న దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చాయన్నారు. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోందని తెలిపారు. రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

కొన్ని రూట్లలో విద్యార్థుల రద్దీ విపరీతంగా ఉంటున్న విషయం ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చిందన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ఆయా రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించిందన్నారు. బస్సులను పెంచే అంశంపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ కట్టుబడి ఉందన్నారు.

కాగా, షాద్ నగర్-ఆమన్‌గల్ రూట్లలో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు కొంతమంది విద్యార్థులు లేఖ రాశారు. ఈ మార్గంలో గతంలో 10 బస్సులు నడిపితే ప్రస్తుతం నాలుగు మాత్రమే నడుస్తున్నట్లు తెలిపారు. ఈ మార్గంలో బస్సుల సంఖ్యను పెంచాలని వారు లేఖలో కోరారు. 

  • Loading...

More Telugu News