Dasharath: 'మిస్టర్ పర్ఫెక్ట్' కోసం ముందుగా ఆ హీరోయిన్నే అనుకున్నాం: డైరెక్టర్ దశరథ్

Dasharath Interview

  • 2011లో విడుదలైన 'మిస్టర్ పర్ఫెక్ట్'
  • ప్రభాస్ ఓకే చేయడం అదృష్టమన్న దశరథ్ 
  • ప్రభాస్ చాలా హోమ్ వర్క్ చేస్తాడని వెల్లడి 
  • రకుల్ చాలా సిన్సియర్ అని వ్యాఖ్య 
  • ఆమె ఫాదర్ కి సారీ చెప్పానని వివరణ

ప్రభాస్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో 'మిస్టర్ పర్ఫెక్ట్' ఒకటి. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దశరథ్ దర్శకత్వం వహించాడు. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమా, 2011లో విడుదలైంది. విడుదలైన అన్ని ప్రాంతలలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమాను గురించి తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దశరథ్ ప్రస్తావించాడు.
 
దిల్ రాజుగారు తన సినిమాల్లో లవ్... ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండేలా చూసుకుంటారు. అందువలన 'మిస్టర్ పర్ఫెక్ట్'ను నిర్మించడానికి ఆయన ముందుకు వచ్చారు. ఈ కథను రెండోసారి వినగానే ప్రభాస్ ఓకే చెప్పారు. అవి నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని క్షణాలు. ప్రభాస్ పెద్దగా ఏమీ పట్టించుకోడు... చెప్పింది చేస్తాడు అని చాలామంది అనుకుంటారు. కానీ ఆయన ఎంత హోమ్ వర్క్ చేస్తాడనేది నాకు తెలుసు" అని అన్నారు. 

"ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా రకుల్ ను అనుకున్నాము. ఆమె ఫాదర్ తో మాట్లాడాము. కానీ కొన్ని కారణాల వలన కాజల్ ఎంట్రీ ఇచ్చింది. రకుల్ విషయంలో ఎవరికీ ఎలాంటి అసంతృప్తి లేదు. ఆమెకి అంకితభావం చాలా ఎక్కువ. రకుల్ ప్రాజెక్టులో లేకపోవడానికి కారణం, మార్కెట్ పరమైన డిమాండ్ కావొచ్చు. ఆ తరువాత వెళ్లి ఆమె ఫాదర్ కి సారీ చెప్పాము. ఆ తరువాత ఆమె ఫస్టు మూవీ ఆడియో ఫంక్షన్ కి నేను .. ప్రభాస్ గారు కలిసి వెళ్లాము" అని చెప్పారు. 

Dasharath
Dil Raju
Prabhas
Kajal Agarwal
Rakul
  • Loading...

More Telugu News