BSNL: మొబైల్ టారిఫ్ పెంపుపై బీఎస్ఎన్ఎల్ ప్రకటన

BSNL will not hike tariffs in near future says Chairman

  • సమీప భవిష్యత్తులో టారిఫ్ పెంచబోమని ప్రకటించిన బీఎస్ఎన్ఎల్
  • వినియోగదారుల సంతోషం, విశ్వాసం గెలుచుకోవడం ముఖ్యమన్న చైర్మన్
  • ఇప్పటికే టారిఫ్ పెంచిన ప్రైవేటు ఆపరేటర్లు

వివిధ కంపెనీలు మొబైల్ టారిఫ్‌లు పెంచిన నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ పెంపుపై స్పష్టతనిచ్చింది. సమీప భవిష్యత్తులో టారిఫ్‌లు పెంచబోమని కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తదితర ప్రైవేటు ఆపరేటర్లు ఇటీవల టారిఫ్‌ను పెంచాయి.

ఈ క్రమంలో ప్రభుత్వరంగ నెట్ వర్క్ టారిఫ్ పెంపుపై పైవిధంగా ప్రకటన చేసింది. సమీప భవిష్యత్తులో టారిఫ్ పెంపు ఉండదని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, ఎండీ రాబర్ట్ రవి స్పష్టం చేశారు. వినియోగదారుల సంతోషం, వారి విశ్వాసాన్ని గెలుచుకోవడం తమకు ప్రధాన లక్ష్యమన్నారు. ఈ క్రమంలో సమీప భవిష్యత్తులో పెంపు ఉండదన్నారు.

BSNL
Mobile Tariff
Reliance
  • Loading...

More Telugu News