CRPF: దేశంలోని అన్ని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపు... సికింద్రాబాద్ స్కూల్లో తనిఖీలు

All CRPF Schools Receive Hoax Bomb Threat

  • సోమవారం అర్ధరాత్రి మెయిల్ రూపంలో బెదిరింపు
  • దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్ళలో క్షుణ్ణంగా తనిఖీలు
  • సికింద్రాబాద్‌లోని జవహర్ నగర్ సీఆర్పీఎఫ్ స్కూల్లో పోలీసుల తనిఖీలు

ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని అన్ని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు సోమవారం అర్ధరాత్రి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో బాంబ్ స్క్వాడ్‌ ల
తో తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్‌లోని జవహర్ నగర్ పరిధిలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఆర్పీఎఫ్ స్కూళ్లకు మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి.

బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలియగానే జవహర్ నగర్ సీఆర్పీఎఫ్ స్కూల్ వద్దకు చేరుకున్న పోలీసులు విద్యార్థులను, అక్కడున్న వారిని బయటకు పంపించారు. ఘటనాస్థలికి చేరుకున్న రాచకొండ సీపీ సుధీర్ బాబు, కుషాయిగూడ ఏసీపీ మహేశ్ పరిస్థితిని పరిశీలించారు. అయితే ఈ బెదిరింపు మెయిల్ వట్టిదే అని తేలింది.

ఆదివారం నాడు దేశరాజధానిలోని రోహిణిలో  సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన మరుసటిరోజే దేశవ్యాప్తంగా అన్ని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు, యాజమాన్యం అప్రమత్తమైంది.

  • Loading...

More Telugu News