Mohan Babu: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని కలిసిన మోహన్ బాబు, మంచు విష్ణు

Mohan Babu and Manchu Vishnu meets Uttarakhand CM

  • డెహ్రాడూన్ లో పుష్కర్ సింగ్ ధామీని కలిసిన మోహన్ బాబు, మంచు విష్ణు
  • ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన సీఎం
  • స్టేట్ ఫిల్మ్ పాలసీ గురించి చర్చించామని వెల్లడి

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు నిన్న కలిశారు. డెహ్రాడూన్ లోని ముఖమంత్రి నివాసానికి వీరు వెళ్లారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పుష్కర్ సింగ్ తెలిపారు.

దక్షిణ భారతానికి చెందిన ప్రముఖ నటుడు, సినీ నిర్మాత మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు తన అధికార నివాసంలో తనను కలిశారని పుష్కర్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సినీరంగ పాలసీ గురించి తాము చర్చించామని చెప్పారు. 

మంచు విష్ణు, మోహన్ బాబు నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'కన్నప్ప' త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు ముందు వీరు మన దేశంలోని జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్నారు. కేదార్ నాథ్ తో వీరు జ్యోతిర్లింగాల దర్శనాన్ని ప్రారంభిస్తున్నారు. 

మోహన్ బాబు, మంచు విష్ణుల జ్యోతిర్లింగాల దర్శనంపై పుష్కర్ సింగ్ స్పందిస్తూ... ఎవరైనా ఒక గొప్ప పనిని చేసేముందు దేవభూమిని సందర్శిస్తారని చెప్పారు. 'కన్నప్ప' చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు, వీరి సమావేశం సందర్భంగా ఉత్తరాఖండ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ సీఈవో, సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ జనరల్ కూడా అక్కడ ఉన్నారు.

Mohan Babu
Manchu Vishnu
Tollywood
Pushkar Singh Dhami
Uttarakhand
  • Loading...

More Telugu News