vettaiyan: మీడియా ప్రతినిధులకు బిర్యానీ ట్రీట్ ఇచ్చిన 'వేట్టయాన్' టీమ్

vettaiyan success celebrations team serve biryani to fans
  • భారీ వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను క్రియేట్ చేస్తున్న వేట్టయాన్
     మూవీ
  • రూ.129 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు టాక్ 
  • థాంక్స్ గివింగ్ మీట్ పేరుతో చెన్నైలో విజయోత్సవ వేడుకను నిర్వహించిన చిత్ర బృందం
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయాన్ – ద హంటర్ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. జై భీమ్ మూవీతో దేశ వ్యాప్తంగా పాప్యులర్ అయిన టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో రజనీకాంత్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దగ్గుబాటి రానా, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, రోహిణి, అభిరామి, దుషారా విజయన్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో నటించారు. దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకూ వేట్టయాన్ మూవీకి రూ.129 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని టాక్ నడుస్తోంది. దీంతో చిత్ర బృందం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో చిత్ర బృందం థాంక్స్ గివింగ్ మీట్ పేరుతో చెన్నైలో విజయోత్సవ వేడుక నిర్వహించింది. ఈ వేడుకలకు చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు, అభిమానులు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. హాజరైన ప్రతి ఒక్కరికి విందు భోజనాలు వడ్డించారు. డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ స్వయంగా చిత్ర బృందంతో కలిసి మీడియా ప్రతినిధులకు బిర్యానీ వడ్డించారు. హీరోయిన్ రితికా సింగ్ సైతం అతిధులకు స్వయంగా వడ్డన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మూవీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

అయితే, ఇటీవల జరిగిన సర్జరీ కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న రజనీకాంత్ ఈ విజయోత్సవ వేడుకకు హజరు కాలేకపోయారని తెలుస్తోంది.   
vettaiyan
vettaiyan success celebrations
Movie News

More Telugu News