Supreme Court: ప్రధాని మోదీ డిగ్రీపై వ్యాఖ్యలు... కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

SC dismisses Arvind Kejriwal plea in case over remark on PM degree

  • మోదీ డిగ్రీపై కేజ్రీవాల్ వ్యాఖ్యల మీద గుజరాత్ వర్సిటీ పరువునష్టం దావా
  • కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన ట్రయల్ కోర్టు
  • సమన్లు కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్
  • ట్రయల్ కోర్టు ఆదేశాల కొట్టివేతకు సుప్రీంకోర్టు నిరాకరణ

ప్రధాని నరేంద్రమోదీ డిగ్రీ విద్యార్హతపై వ్యాఖ్యల కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కొన్నాళ్ల క్రితం ప్రధాని మోదీ డిగ్రీపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. మోదీ డిగ్రీపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను గుజరాత్ యూనివర్సిటీ ఖండించింది. అంతేకాదు, ఢిల్లీ మాజీ సీఎంపై పరువునష్టం కేసు దాఖలు చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేసింది.

ట్రయల్ కోర్టు ఇచ్చిన సమన్లను కొట్టివేయాలని కోరుతూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ అనంతరం, ట్రయల్ కోర్టు ఆదేశాలను కొట్టివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.

  • Loading...

More Telugu News