Stock Market: అమ్మకాల ఒత్తిడి... నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses

  • 73 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 72 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2.83 శాతం పతనమైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమయిన సూచీలు ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 73 పాయింట్లు నష్టపోయి 81,151కి పడిపోయింది. నిఫ్టీ 72 పాయింట్లు కోల్పోయి 24,781 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.83%), ఏషియన్ పెయింట్స్ (1.58%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.91%), టెక్ మహీంద్రా (0.78%), రిలయన్స్ (0.76%). 

టాప్ లూజర్స్:
కొటక్ బ్యాంక్ (-4.29%), బజాజ్ ఫిన్ సర్వ్ (-3.05%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.86%), అదానీ పోర్ట్స్ (-2.15%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.93%).

  • Loading...

More Telugu News