KTR: గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన... కేటీఆర్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

Police heavily deployed at KTR house

  • మధ్యాహ్నం 2 గంటల నుంచి గ్రూప్-1 ఎగ్జామ్స్
  • ఇప్పటికే కేంద్రాలకు చేరుకుంటున్న అభ్యర్థులు
  • కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద పోలీసుల మోహరింపు

గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో కేటీఆర్ అశోక్‌నగర్ వెళ్లే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంజారాహిల్స్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసం వద్దకు పోలీసులు భారీగా చేరుకుని మోహరించారు. పలువురి బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది.

కాగా, నేటి నుంచి గ్రూప్-1 పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనుండడంతో అభ్యర్థులు ఇప్పటికే కేంద్రాలకు చేరుకుంటున్నారు. 1.30 గంటలకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాల లోపలికి అనుమతిస్తారు.

KTR
BRS
Group-1 Exams

More Telugu News