Telangana: నేటి నుంచి దక్షిణకొరియాలో తెలంగాణ మంత్రుల పర్యటన

Telangana ministers to visit South Korea

  • ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు కొనసాగనున్న పర్యటన
  • మంత్రులతో పాటు పర్యటించనున్న పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు
  • సియోల్ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని అధ్యయనం చేయనున్న మంత్రులు

తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం దక్షిణకొరియాలో పర్యటించనుంది. మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నగరే మేయర్, పలువురు ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ, మూసీ రివర్ ఫ్రంట్ అధికారులు సౌత్ కొరియాలో పర్యటించనున్నారు. ఈ రోజు (21) నుంచి 24వ తేదీ వరకు వీరి పర్యటన కొనసాగుతుంది. 

మూసీ నది పురజ్జీవం నేపథ్యంలో... దక్షిణకొరియా రాజధాని సియోల్ లోని రివర్ ఫ్రంట్ అభివృద్ధిని వీరు అధ్యయనం చేయనున్నారు. మరోవైపు, సియోల్ నగరపాలక సంస్థ ప్రతి రోజు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. పర్యావరణంపై దుష్ప్రభావం పడకుండా నగర వ్యర్థాలను పునర్వినియోగంలోకి తెచ్చే అద్భుత సాంకేతికతను వారు వినియోగిస్తున్నారు. ఈ విధానాన్ని అధ్యయనం చేసి మన స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ అమలు చేసే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

  • Loading...

More Telugu News