Ramya Pandian: పెళ్లిపీటలు ఎక్కబోతున్న కోలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరంటే..!

Kollywood actress Ramya Pandian to marry his boy friend
  • యోగా ట్రైనర్ లోవెల్ ను ప్రేమ వివాహం చేసుకోబోతున్న రమ్య పాండియన్
  • బెంగళూరులో యోగా శిక్షణ పొందే సమయంలో లోవెల్ తో రమ్యకు పరిచయం
  • వచ్చే నెల 8న పెళ్లి జరగనున్నట్టు కోలీవుడ్ టాక్
కోలీవుడ్ హీరోయిన్ రమ్య పాండియన్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. లోవెల్ ధావన్ ను ఆమె ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. పంజాబ్ కు చెందిన లోవెల్ యోగా ట్రైనర్ గా పని చేస్తున్నారు. వీరి వివాహం వచ్చే నెలలో రిషికేశ్ లో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రముఖ ఆథ్యాత్మికవేత్త రవిశంకర్ కు చెందిన బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ లో యోగా శిక్షణ పొందే సమయంలో లోవెల్ తో రమ్యకు పరిచయం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. వచ్చే నెల 8న వీరి వివాహం జరగనుందని, 15వ తేదీన చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని కోలీవుడ్ సమాచారం. రమ్య కోలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించారు. 'కుక్ విత్ కోమాలి' అనే కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.
Ramya Pandian
Kollywood
Marriage

More Telugu News