Goodbye Hug: మూడు నిమిషాలకు మించి కౌగిలింత వద్దు.. న్యూజిలాండ్ ఎయిర్‌పోర్టులో కొత్త నిబంధన

Goodbye Hug Max Three Minutes

  • డ్యునెడిన్ విమానాశ్రయంలో కొత్త నిబంధన
  • సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
  • ఎక్కువమందికి అవకాశం ఇచ్చేందుకేనన్న ఎయిర్‌పోర్టు సీఈవో

ఆప్తులకు ఫేర్‌వెల్ ఇస్తూ ఇచ్చే ‘గుడ్‌బై హగ్’ (కౌగిలింత) మూడు నిమిషాలకు మించరాదంటూ న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్ విమానాశ్రయం డ్రాప్ అఫ్ ఏరియాలో అధికారులు సైన్‌బోర్డు ఏర్పాటు చేశారు. ఎవరో ప్రయాణికుడు దీనిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో దీనిపై విపరీతమైన చర్చ జరుగుతోంది. 

కౌగిలింతకు టైమ్ లిమిట్ ఏమంటూ కొందరు విమర్శలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ కొత్త నిబంధనను ప్రశంసిస్తున్నారు. ఇతర విమానాశ్రయాల్లోనూ ఇలాంటి నిబంధనే తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు మాత్రం డ్రాప్ అఫ్ ఏరియా ఇంకా ఉచితమేనా? అని ఆశ్చర్యపోతున్నారు. 

ఈ సైన్ బోర్డు ఏర్పాటుపై డ్యునెడిన్ విమానాశ్రయ సీఈవో డేనియల్ డి బోనో మాట్లాడుతూ.. విమానాశ్రయాలు ‘ఎమోషనల్ హాట్‌స్పాట్లు’ అని అభివర్ణించారు. 20 సెకన్ల కౌగిలింతకే అవసరమైంత ‘లవ్ హార్మోన్’ ఆక్సిటోసిన్ విడుదలవుతుందని పేర్కొన్నారు. తక్కువ సమయం కౌగిలింతల వల్ల ఎక్కువమందికి అవకాశం లభిస్తుందని తెలిపారు. 

Goodbye Hug
Dunedin Airport
Farewell
New Zealand
  • Loading...

More Telugu News