Harish Rao: రేవంత్ రెడ్డీ... నీ వెంటపడుతూనే ఉంటాం: హరీశ్ రావు

Harish Rao warns Revanth Reddy

  • పేదల ఇళ్లు కూలగొడితే ఊరుకునేది లేదన్న హరీశ్ రావు
  • పేదల కోసం చావడానికైనా సిద్ధమని ప్రకటన
  • తెలంగాణ కోసం తెగించి పోరాడామని వెల్లడి
  • నీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు అంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తన విమర్శల దాడిని కొనసాగించారు. బుల్డోజర్ ఎక్కిస్తే, పేదల కోసం చావడానికైనా సిద్ధమని ప్రకటించారు. పేదల ఇళ్లు కూలగొడితే ఊరుకునేది లేదు... నీ వెంట పడుతూనే ఉంటాం అని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. 

"మూసీ సుందరీకరణకు అడ్డువస్తే నన్ను, కేటీఆర్ ను బుల్డోజర్ల కిందేసి చంపేస్తాడట! మిస్టర్ రేవంత్ రెడ్డీ... నువ్వు చంపుతానన్నా, నువ్వు కేసులు పెడతానన్నా మేం భయపడేది లేదు... అట్లా భయపడే వాళ్లమైతే కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేవాళ్లం కాదు! కేసీఆర్ గీసిన గీతలో, ప్రాణాలకు తెగించి, కేసులకు భయపడకుండా పోరాడాం కాబట్టే తెలంగాణ తీసుకువచ్చాం. ఇవాళ నీ తాటాకు చప్పుళ్లకు భయపడతామా!" అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  

కాంగ్రెస్ పాలనలో రైతుబంధు రావడం లేదని, ప్రభుత్వంపై పోరాటం చేయాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. పెన్షన్లు పెంచుతామని చెప్పి మోసం చేశారని, రేవంత్ రెడ్డి మోసాలను ప్రజలు గ్రహిస్తున్నారని పేర్కొన్నారు.

Harish Rao
Revanth Reddy
Musi River Project
BRS
Congress
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News