Frog in Biryani: గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో... చికెన్ బిర్యానీలో కప్ప!

Frog found in Chicken Biryani

  • బిర్యానీలో కప్ప రావడంతో అవాక్కయిన విద్యార్థులు
  • మెస్ ఇన్చార్జి దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థులు
  • సిబ్బంది నిర్లక్ష్యమేనంటూ ఆగ్రహం

చికెన్ బిర్యానీ అంటే అందులో చికెనే ఉండాలి!... కానీ, హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ మెస్ లో చికెన్ బిర్యానీలో కప్ప ప్రత్యక్షమైంది. ఓ విద్యార్థికి వడ్డించిన బిర్యానీలో కప్ప కనిపించడంతో అందరూ నివ్వెరపోయారు. ఈ విషయాన్ని విద్యార్థులు మెస్ ఇన్చార్జి దృష్టికి తీసుకెళ్లారు. 

బిర్యానీలో కప్ప రావడం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని, అందుకు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. 

కాగా, విద్యార్థులు చికెన్ బిర్యానీలో కప్ప అంశంపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

Frog in Biryani
IIIT
Gachibowli
Chicken Biryani
Frog
Hyderabad
  • Loading...

More Telugu News