Big boss: బిగ్ బాస్ 8.. నాగ మణికంఠ కన్నీటి వేడుకోలు

Naga Manikanta Request to big boss

  • హౌస్ లో ఉండలేనంటూ బిగ్ బాస్ కు విజ్ఞప్తి
  • తనకు ఓటేయవద్దంటూ ప్రేక్షకులను కోరిన నాగ మణికంఠ
  • ఈ వారం ఎలిమినేట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం

బిగ్ బాస్ సీజన్ 8లో మరో ఎలిమినేషన్...! ఇప్పటికే ఏడుగురు హౌస్ మేట్లు బయటకు వెళ్లిపోగా ఈ వారం నాగ మణికంఠ బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. 

నాగ మణికంఠతో పాటు ఈ వారం ఎలిమినేషన్స్ లో యష్మి, తేజ, నబీల్, గౌతమ్, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, హరితేజ.. ఇలా మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. అయితే, తాజా ఎపిసోడ్ లో నాగ మణికంఠ బిగ్ బాస్ కు చేసిన ఓ విజ్ఞప్తి వైరల్ అవుతోంది. హౌస్ లో సోఫాలో పడుకుని కెమెరాను చూస్తూ నాగ మణికంఠ తనను బయటకు పంపించేయాలని కోరడం వీడియోలో కనిపిస్తోంది.

హౌస్ లో గొడవలు, కొట్లాటలు తన వల్ల కావడంలేదని అంతకుముందు కూడా నాగ మణికంఠ కన్నీళ్లతో బిగ్ బాస్ కు చెప్పాడు. తనను ఎలిమినేట్ చేయాలంటూ నాగార్జునకు కూడా విజ్ఞప్తి చేశాడు. అయితే, అది తన చేతుల్లో లేదని, హౌస్ లో ఎవరు ఉండాలి, ఎవరు బయటకు వెళ్లాలనేది ప్రేక్షకులే డిసైడ్ చేస్తారని నాగార్జున స్పష్టం చేశారు. దీంతో కెమెరా ముందుకొచ్చిన నాగ మణికంఠ.. తనకు ఓటేయవద్దని ప్రేక్షకులను కోరాడు. తాజా సమాచారం ప్రకారం ఈ వారం నాగ మణికంఠ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ ఆదివారం ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది.

Big boss
naga manikanta
Elimination
weekend big boss
entertainment
  • Loading...

More Telugu News