Lawrence Bishnoi: జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి ఏడాది రూ. 40 లక్షల ఖర్చు!

Gangster Lawrence Bishnoi Family Spends Rs 40 Lakhs Each Year To Him

  • సల్మాన్‌ఖాన్ హత్యకు ప్లాన్ చేసి వెలుగులోకి లారెన్స్ బిష్ణోయ్
  • ప్రస్తుతం జైలులో ఉన్నా అక్కడి నుంచే కార్యకలాపాలు
  • యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే నేర సామ్రాజ్యంలోకి అడుగులు
  • హర్యానా పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేసిన లారెన్స్ తండ్రి
  • తొలి నుంచి సంపన్న కుటుంబమే

జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు సంబంధించి ఆయన కుటుంబ సభ్యుడు ఒకరు సంచలన విషయాలు వెల్లడించారు. లారెన్స్ జైలులో ఉన్నప్పటికీ అతడి అవసరాల కోసం కుటుంబ సభ్యులు ఏడాదికి రూ. 40 లక్షలకుపైగా ఖర్చు చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆయన బంధువు రమేశ్  బిష్ణోయ్ వెల్లడించారు.

తమది తొలి నుంచి సంపన్న కుటుంబమేనని రమేశ్ తెలిపారు. లారెన్స్ తండ్రి హర్యానా పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసినట్టు పేర్కొన్నారు. వారికి తమ గ్రామంలో 110 ఎకరాల భూమి ఉన్నట్టు తెలిపారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయ విద్యను పూర్తిచేసిన లారెన్స్ గ్యాంగ్‌స్టర్‌గా మారతాడని తాము ఊహించలేదన్నారు. అతడెప్పుడూ ఖరీదైన దుస్తులు, బూట్లు ధరించేవాడని గుర్తుచేసుకున్నారు.

బిష్ణోయ్ అసలు పేరు బాల్కరన్ బ్రార్. పాఠశాలలో చదువుతున్న సమయంలో తన పేరును లారెన్స్ బిష్ణోయ్‌గా మార్చుకున్నాడు. యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలోనే లారెన్స్ చెడు బాట పట్టాడు. డీవీఏ కాలేజీ గ్యాంగ్‌వార్‌లో అతడి ప్రియురాలిని ప్రత్యర్థి వర్గం సజీవ దహనం చేయడంతో పూర్తిగా నేరాల బాట పట్టాడు. అనుచరుడు సంపత్ నెహ్రాతో కలిసి 2018లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ హత్యకు కుట్ర పన్నడంతో దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగింది.

లారెన్స్ ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ అక్కడి నుంచే తన నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. సింగర్ సిద్దూ మూసేవాలా, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీపై దాడులకు అక్కడి నుంచే ప్లాన్ చేసి హతమార్చాడు.

  • Loading...

More Telugu News