Online Nikah: పాకిస్థాన్ యువతిని ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న బీజేపీ కార్పొరేటర్ కొడుకు

A unique cross border online marriage wedding ceremony took place in this Uttar Pradesh

  • వీసా దక్కకపోవడంతో ఆన్‌లైన్‌లోనే నిఖా వేడుక
  • లాహోర్‌ అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఉత్తరప్రదేశ్ యువకుడు
  • శుక్రవారం రాత్రి వైభవంగా జరిగిన వివాహం

పాకిస్థాన్ అమ్మాయికి, భారతదేశ అబ్బాయికి అనివార్య పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో వివాహం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడి కుమారుడు ఇలా ప్రత్యేక పరిస్థితుల్లో నిఖా చేసుకున్నాడు. బీజేపీ కార్పొరేటర్ అయిన తహసీన్ షాహిద్ పెద్ద కుమారుడు మహ్మద్ అబ్బాస్ హైదర్‌ పాక్‌లోని లాహోర్‌కు చెందిన ఆండ్లీప్ జహ్రాను పెళ్లి చేసుకున్నారు. 

ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్య వివాదాల కారణంగా వరుడు షాహిద్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా దక్కలేదు. దానికి తోడు వధువు తల్లి యాస్మిన్ జైదీ అనారోగ్యంతో ఐసీయూలో చేరడం పెళ్లికి మరింత ఆటంకంగా మారింది. దీంతో పెళ్లి వేడుకను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని షాహిద్ నిర్ణయించుకున్నాడు. పెళ్లి కూతురు తరపువారు కూడా అంగీకారం తెలపడంతో ఆన్‌లైన్‌లోనే పెళ్లి తంతుని ముగించారు.

శుక్రవారం రాత్రి ఆన్‌లైన్‌లో నిఖా జరిగింది. ఇక్కడి నుంచి షాహిద్ కుటుంబ సభ్యులు, లాహోర్‌ నుంచి వధువు కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వివాహంపై షియా మత పెద్ద మౌలానా మహఫూజుల్ హసన్‌ఖాన్ స్పందించారు. ఇస్లాంలో నిఖాకు స్త్రీ అంగీకారం చాలా ముఖ్యమని, తన సమ్మతిని ఆమె మౌలానాకు తెలియజేస్తుందని చెప్పారు. ఇరువైపుల మౌలానాలు కలిసి వేడుకను నిర్వహించగలిగినప్పుడు ఆన్‌లైన్‌లో నిఖా సాధ్యమవుతుందని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News